Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
- తార్నాక డివిజన్లో పర్యటన
నవతెలంగాణ-ఓయూ
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. గురువారం తార్నాక డివిజన్లో పర్యటించి గోకుల్ నగర్లో రోడ్డు, సీవరేజీ పనులను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించాలని ఆదేశించారు. పనులను వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోందని, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగ అధికారులు డీఈ రఘు, ఏఈ వెంకటేష్, మంచినీటి విభాగ అధికారి ఏఈ నికిత రెడ్డి, గోకుల్‌నగర్ కాలనీసభ్యులు పాల్గొన్నారు.