Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-బేగంపేట్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అనేకమంది లబ్ది పొందుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద 7 మందికి కల్యాణలక్ష్మి, 7 మంది లబ్దిదారులకు షాదీ ముబారక్ కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శం అయ్యా యన్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి రూ.లక్షకు పైగా ఆర్థిక సాయం అందించే గొప్ప కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేదన్నారు. ఆసరా పెన్షన్ కింద వృద్ధులు, వితంతు వులు, వికలాంగులకు ఆర్ధిక సాయం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో ఉచితంగా మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, దుస్తుల పంపిణీ చేస్తు న్నట్టు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కార్పొరేట్ హాస్పి టల్స్ కంటే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నా యన్నారు. గుండె, మోకాళ్ళు ఇతర అవయవాల మార్పిడి వంటి చికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో జరుగుతు న్నాయంటే ఎంత అభివృద్ధి సాధించామో అర్ధం చేసుకో వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత..
సనత్‌నగర్‌కు చెందిన సతీష్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సాయం పత్రాన్నిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్‌రెడ్డితో కలిసి అందజేశారు. సతీష్ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం రూ.2.50 లక్షలు మంజూరు కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.