Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మెన్ మణికొండ వేద కుమార్
- ఆకుపచ్చని దుస్తులు ధరించి విద్యార్థుల ర్యాలీ
నవతెలంగాణ-అంబర్పేట
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మెన్ మణికొండ వేదకుమార్, వైస్ చైర్పర్సన్ ప్రార్థన మణికొండ అన్నారు. శుక్రవారం ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్, జూనియర్ విద్యార్థులు 'పచ్చదనాన్ని కాపాడండి, భూమిని రక్షించండి' నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ ఆకుపచ్చ రంగు అత్యంత ప్రశాంతమైనది అని, ఇది మన ఆత్మగౌరవానికి శ్రేయస్సుకి ప్రతీక అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటుతూ పర్యావరణానికి అండగా నిలవాలన్నారు. భవిష్యత్ తరాలకి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్కూల్లో ఆకుపచ్చ దుస్తులను ధరించి, చెట్లవేషాలు వేసుకుని పాఠశాల క్యాంపస్ చెట్టు లేన్ దగ్గర చిన్నపిల్లలతో గో గ్రీన్, కీప్ సైలెంట్ అండ్ గో గ్రీన్ నినాదాలతో కూడిన ప్లకార్ట్స్ పట్టుకొని నిర్వహించిన ర్యాలీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రభాకర్, హెచ్ఎం రామానుజుల, ప్రీ ప్రయిమరీ ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.