Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీటీ అధ్యక్షులు మజీదుల్లా ఖాన్
నవతెలంగాణ-ధూల్‌పేట్
దేశ రాజ్యాంగ పరిరక్షణ తక్షణ కర్తవ్యమని ఎంబీటీ అధ్యక్షులు మజీదుల్లా ఖాన్ (ఫర్హత్) ఉద్ఘాటించారు. ఆవాజ్ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ పరిరక్షణ అంశం'పై పాతబస్తీ ఉర్దూ ఘర్‌లో సెమినార్ జరిగింది. ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి మజీదుల్లా ఖాన్ హాజరై మాట్లాడుతూ భవిష్యత్తులో మైనారిటీలు హక్కులపై పోరాటాలు చేయాలి అంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవడం అవసరమని అన్నారు. రాజ్యాంగం భారతదేశంలో ముస్లింలకి, క్రైస్తవులకి, బుద్ధులకు, ఇతర నిమ్మ కులాలకు, అణగారిన వర్గానికి ఇచ్చిన ఒక పెద్ద ఆయుధం అని అన్నారు. అలాంటి ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలని తద్వారా మనకు హక్కులు కల్పించబడతాయని అన్నారు. ప్రస్తుత బీజేపీ పరిపాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ నిర్వీర్యం చేస్తుందన్నారు. సీనియర్ అడ్వకేట్ మౌలానా అబ్దుల్ ఖుదూస్ గౌరీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తున్నారన్నారు. సార్వభౌమాత్వాన్ని నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవాజ్ అధ్యక్షులు అబ్దుల్లాతీఫ్, ఆవాజ్ నాయకులు మహమ్మద్ బాబామియ, హీన ఫాతిమా, బుంగ శివకుమార్, గులాం నసీర్, షేక్ అంజద్, మహమ్మద్ ఫహీం, సయ్యద్ ఇబ్రహీం, మహమ్మద్ ఖాదర్, నూర్జహాన్ బేగం సయ్యద్ అలీమ్, మహమ్మద్ కలీముద్దీన్, షేక్ హుస్సేన్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నాయకులు, సికందరుల్లా ఖాన్, మహమ్మద్ అశ్వాక్ కోవా తదితరులు పాల్గొన్నారు.