Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేడ్కర్ అశయ సాధమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా శక్తివంతమైందని అందుకే రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా పిలుస్తారని అంబేద్కర్ అశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఈ దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడానికి ప్రతి వారం అంబేడ్కర్ స్మరణ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ ఆదివారంతో 197వారానికి చేరింది. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశానికి లేని అద్భుత మైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రత్యేకించి పేద, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం తన శక్తియుక్తులను ఉపయోగించి, వారికి రాజ్యాంగంలో అనేక ప్రత్యేక హక్కులను పొందుపరిచి, వారి అభ్యున్నతికి తోడ్పడిన గొప్ప మహనీయుడు అంబేడ్కర్ అని తెలిపాడు. భారత రాజ్యాంగం యొక్క మాధుర్యం, గొప్పదనం తెలియాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని చేధించాల్సిన అవసరం బహుజన సమాజం పైనే ఉన్నదని పేర్కొంటూ, బహుజన సమాజాన్ని చైతన్యవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించా లని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇటికాల వీందర్ పాల్గొని మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ బహుజన సమాజ అభ్యున్నతి కోసం ఎంతో కషి చేసిన త్యాగశీలి అని, ఆయన త్యాగాన్ని వధా కానియొద్దని పిలుపు నిచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో ఉద్యోగస్తులుగా మనం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత మనపైనే ఉందని తెలిపారు. రాబోయే 200 వారాల జ్ఞాన సభ విజయవంతం అవుటకు ఉద్యోగ స్తులుగా మనమందరం సహకరించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం నాయకులు మందుల సూర్యకిరణ్, కామగల బాబు, బండారి సాయి, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు యేసు రాజు, జై భీమ్ అజరు, దుబ్బ నాగర్జున కుమార స్వామి, జి.వెంకటేష్, బెక్కం శివ, మేస్త్రి, శ్రీను, ఏనుగుల అశోక్, కొమురయ్య, వై.శీను, తేజ్,మధు, జైభీమ్,అజరు పాల్గొన్నారు.