Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- కుషాయిగూడలో దోబీఘాట్ యూనిట్ ప్రారంభం
నవతెలంగాణ-కాప్రా
అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం కుషాయిగూడలో రూ.52.04 లక్షలతో చేపట్టిన ఆధునిక యంత్ర దోబీఘాట్ యూనిట్‌ను ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తుల సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ఆ ఫలాలు వారికి అందేలా చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎవరు కూడా చేయలేకపోయారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో షెడ్డు నిర్మాణం కోసం రూ.15 లక్షలు మంజూరు చేయించానని గుర్తు చేశారు. కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ టి ఝాన్సీ రాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్ గౌడ్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు సాయికుమార్, ఉపేందర్ యాదవ్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దర్గా దయాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మెన్ అక్కిరాజు శ్రీనివాస్, వైస్ చైర్మెన్ పెద్దాపురం కుమారస్వామి, పైళ్ల ఆశయ్య, ఎంబీసీ మాజీ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్, చల్లా వీరేశం, కుషాయిగూడ దోబీ ఘాట్ అధ్యక్షులు చల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫూలే విగ్రహానికి నివాళి
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఫూలే 132 వర్ధంతి సందర్భంగా సైనిక్‌పురి, మల్లాపూర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు, మహిళా విద్య కోసం పాటుపడిన గొప్ప మానవతావాది ఫూలే అని కొనియాడారు. ఆయన కలలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పాజ్జూరి పావని మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.