Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ పత్తి కుమార్, ఉప్పల్ ఎస్సీ సెల్ చైర్మెన్ హెచ్ఆర్ మోహన్, కాంటెస్టెంట్ కార్పొరేటర్లు సంజీవరెడ్డి, పులిపాక అంజయ్య, మేడల మల్లికార్జున గౌడ్, నెమలి అనిల్, పీజీ సుదర్శన్, ఉమేష్ గౌడ్, దంతురి రాజు గౌడ్, బెల్లం గట్టయ్య యాదవ్, అల్లాడి కృష్ణ యాదవ్, నవీన్, బాలరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
మల్లాపూర్ చౌరస్తాలో
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మల్లాపూర్‌చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఉప్పల్ ఎమ్మేల్యే బేతీ సుభాష్ పుప్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాచారం సీఐ కిరణ్ కుమార్, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంఘం సభ్యులు ఆంజనేయులు, వాసుదేవ్ గౌడ్, అల్లాడి కృష్ణ యాదవ్, బాలరాజు, చంద్రశేఖర్, రఘు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో..
కంటోన్మెంట్: సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం బహుజనుల హక్కుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాస్ రావు అన్నారు. బీసీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సోమవారం కంటోన్మెంట్, బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు యనమల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ బహుజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, రాష్ట్ర నేతలు నూర్ బాషా, దూదేకుల ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్, తెలంగాణ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కవితా దేవి, డి.ముత్యాలు, ఎం.రామాచారి, పిట్ల రాజు ముదిరాజ్, కె.రమేష్, ఓం ప్రకాష్ యాదవ్, పి.వెంకట్ రావు, సీనియర్ జర్నలిస్టు గవ్వల శ్రీనివాసులు, వెంకటాచారి, వెంకట్రావు, రమేష్ ముదిరాజ్, కవిత, ముత్యాలు, పి గణేష్, సత్తార్ షేక్ వలీ పాల్గొన్నారు
మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో..
మల్కాజిగిరి టీఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యక్తరలు పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావు పూలే
జవహర్‌నగర్: సమసమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావుపూలే అని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గాయకుడు వెంకటాచారి రచించిన పాటను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రభాకర్ యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.