Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ ప్రాంతంలోని బోయినపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ప్రేమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలాజీ ఫ్యామిలీ దాబాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుచి, శుచి, నాణ్యమైన ఆహారపదార్థాలను వినియోగదారులకు అందచేస్తే హోటల్స్, రెస్టారెంట్లు అభివృద్ధి చెందుతాయన్నారు. వెజ్ ఫ్యామిలీ దాబా భోజన ప్రియులకు అందుబాటులో రావడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు కె. పాండు యాదవ్, ముప్పిడి మధుకర్, అజరు, టింకు గౌడ్, దాబా నిర్వాహకులు. పోనాలాల్ భౌతి, రమేశ్ దేవడో, హరోం పాల్గొన్నారు.