Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
- బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఫూలే : డీజీఎం సూర్య కుమార్
- జ్యోతిరావు ఫూలేకు నివాళ్లు
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఫూలే వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగు తల్లి నగర్లో ఫూలే వర్ధంతి సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని సీనియర్ నాయకులు మన్నె రాజు ,డివిజన్ అధ్య క్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్‌తో కలిసి ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కలిగించి, వారి సాధికారత కోసం కృషిచేసిన మానీయుడు జ్యోతి రావు ఫూలే అని అన్నారు. విద్య, వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం, నిర్మూలించడానికి, కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఆయన ఎంతో కషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయ కులు వెంకటస్వామి, యూసుఫ్, ప్రభాకర్ ,రాజ్ కుమార్, తారా సింగ్ , దేవి ,శ్యామల రాథోడ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : సమ సమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మా జ్యోతిరావు ఫూలే దేశ ప్రజల హదయాలలో చిరస్థాయిగా నిలిచారని హిందూస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఇంచార్జ్ డీజీఎం హెచ్.ఆర్ సూర్య కుమార్ రౌట్ కొనియాడారు. సోమవారం ఫూలే 132వ వర్ధంతిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ పరిశ్రమలలో ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్ఏఎల్ ఇన్ చార్జ్ డీజీఎం హెచ్.ఆర్ సూర్య కుమార్ రౌట్ విచ్చేసి ఫూలే విగ్రహానికి ఫూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనంపై అలుపెరుగనిపోరాటం చేసి, మహిళలు, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం, విద్యావకాశాలు కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. అంటరాని తనం, స్త్రీలకు విద్య అవసరమని 18వ శాతాబ్దంలోనే గ్రహించి దానికోసం తన కుటుంబంతో సహా కషి చేసిన మహనీయుడు, ఫూలే అన్నారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకుని నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ విట్టల్, ఓబీసీ లైషన్ అధికారి శ్రీహరి, రాష్ట్ర నాయకులు జయేందర్ గౌడ్, బిఎంస్ యూనియన్ అధ్యక్షులు జానకిరామ్, ప్రధానకార్యదర్శి వెంగళరావు, హెచ్ఏ డబ్ల్యూ యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వేంకటాద్రి, హెచ్ఏఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్క నాగరాజు, ఐఈయు అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, టీఈయు అధ్యక్షులు జీవన్, ఓబీసీ అధ్యక్షులు రవికుమార్ ముదిరాజ్, ఎస్సీ అసోసియేషన్ అధ్యక్షులు వై. భాస్కర్ రావ్, ప్రధాన కార్యదర్శి జె. రామకష్ణ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు కిషన్ నాయక్, పరంజ్యోతి, మధు, శాంతి, పద్మావతి తదితరులు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.