Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ తూంకుంట మున్సిపాల్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్‌రెడ్డి
- అదనపు కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-శామీర్‌పేట
దేవాదాయశాఖ భూములు ఆక్రమణదారుల చెరనుంచి కాపాడాలని కాంగ్రెస్ తూంకుంట మున్సిపాల్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణీ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహరెడ్డిని జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కలిసి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తూంకుంట మున్సిపాల్టీ దేవర్యాంజాల్ పరిధిలోని దేవాదాయశాఖకు సంబంధించిన రాములోరి భూములు 639, 640 సర్వే నెంబర్లలోని 15 ఎకరాల భూమిని వందలమంది స్థానికే తరులు అక్రమంగా కబ్జా చేసి గతంలో గుడిసెలు వేసారని, ఇప్పుడు ఇల్లు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. వాటిని వెంటనే తొలగించి దేవాదాయ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్.. లా ఆఫీసర్ చంద్రావతిని పిలిచారు. అయితే పండుగలు పలు కారణాలు రిత్యా పోలిసు ప్రోటక్షన్ ఇవ్వలేదని వారన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్.. శామీర్‌పేట తహసీల్దార్‌ను, తూంకుంట మున్సిపాల్టీ కమీషనర్‌తో చర్చించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్తు అధికారులు తక్షణమే విద్యుత్తు నిలిపివేయాలని లేదంటే తను కలెక్టర్, సీఎస్‌తో మట్లాడి అధికారులపై చర్యలు తీసుకునేలా చూస్తానని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మురళిగౌడ్, రాము, ఒబిసి సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి, ఉప్పరిపల్లి అధ్యక్షులు బాబు, హకింపేట అధ్యక్షులు జగన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.