Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు
- మేడ్చల్ చెక్ పోస్టులో బ్లింకర్లు ప్రారంభం
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చేర్యలు చేపడుతున్నారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్‌రావు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు మేడ్చల్ చెక్ పోస్టులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లింకర్లను డీసీపీ టీ.శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది తమ సొంత ఖర్చుతో బ్లిం కర్లను ఏర్పాటు చేయడం అభినంద నీయమని అన్నారు. మేడ్చల్ నుంచి డబిల్ పుర్ దారిలో 7 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని తెలిపారు. గత మూడు నెలలతో పోల్చుకుంటే మేడ్చల్ లో రోడ్డు ప్రమాదాలు తగ్గా యన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సందీప్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్ర శేఖర్ రెడ్డి,పెట్ బషిరాబాద్ ఏసీపీ వి.వి.ఎస్ రామ లింగ రాజు, మేడ్చల్ ట్రాఫిక్ సీఐ బి.నర్సింహ రెడ్డి, మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.