Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగద్గిరిగుట్టలో శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహణ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్ పరిధిలోని భగత్ సింగ్ మార్గ్ లో శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య దంత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఆధ్వర్యంలో డాలర్ స్మైల్ మల్టీ స్పెషాలిటీ డెంటో కాస్మెటిక్ హాస్పిటల్ (చింతల్) నేతత్వంలో నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు లయన్ వినోద్ జాదవ్, ప్రధాన కార్యదర్శి, పాఠశాల కరస్పాండెంట్, బిర్రు ఆంజనే యులు, జిల్లా చైర్ పర్సన్, సర్వీస్ క్యాంప్ లయన్ చల్లా శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్య క్షులు.కె. రామేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా టీయుడబ్ల్యూజె. (ఐజేయు) అధ్యక్షులు లయన్ గడ్డమీది బాలరాజు గౌడ్ లు హాజరై ప్రారంభించారు. ఈ దంత వైద్య శిబిరంలో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సుమారు 1123 మందికి నూతన సాంకేతిక విధానంతో కూడిన ఇంట్రా ఓరల్ కెమెరా ద్వారా ప్రముఖ దంత వైద్య నిపుణులు ఎస్. బిందుప్రియ, డాక్టర్ భవాని, డాక్టర్ నేహా, డాక్టర్ తరుణలు దంత పరీక్షలు చేశారు. అనంతరం దంతా లకు సంబంధించిన కిట్లు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులు దంతాల సంరక్షణపై పలు సూచనలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బిర్రు శోభారాణి, సంఘ సేవకులు గోపాల్ రెడ్డి, ఉపాధ్యా యులు. అనే ఫాతిమా, ప్రశాంతి, రజిత, మహేశ్వరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.