Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్
నవతెలంగాణ-సంతోష్ నగర్
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయజూస్తున్న భూ బకాసురులను తరిమికొడదాం అనీ, సింగరేణి గుడిసెల స్థలాన్ని కాపాడుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్ అన్నారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆదివారం రాత్రి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఎం.బాలు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అబ్బాస్ మాట్లాడారు. సింగరేణి గుడిసెల స్థలాన్ని కొందరు సొసైటీల పేరుతో కాజేయా లని చూస్తున్నారన్నారు. అదే జరిగితే గుడిసె వాసులంతా గుడిసెలు కోల్పోయి నిర్వాసితులయ్యే ప్రమాదం పొంచి ఉంద న్నారు. గుడిసె వాసులకు అండగా సీపీఐ(ఎం) నిలుస్తూ గుడిసెల స్థలాన్ని కబ్జాకు గురికాకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉంద న్నారు. గుడిసె వాసులంతా సంఘటితమై వారి గుడిసెలను కాపాడుకునేందుకు సీపీఐ(ఎం)తో కలసి రావాలన్నారు. మోస గించి గుడిసెల స్థలాన్ని భూ కబ్జాదారులకు అప్పనంగా అప్పజె ప్పేందుకు కొందరు దళారులు చూస్తున్నారనీ, అలాంటి వారి మాటలు నమ్మి గుడిసె వాసులు మోసపోవద్దు అన్నారు. గుడిసె వాసులకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. గుడిసె వాసుల కు పక్కా గృహాలు నిర్మించి పట్టాలు ఇచ్చేంతవరకు ప్రభుత్వంతో ఎంతటి పోరాటానికైనా తాం సిద్ధం అన్నారు. డిసెంబర్ 12వ తేదీన సైదాబాద్ మండల కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో గుడిసెవాసులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు జి.విట్టల్, ఎం.మీనా, నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జంగయ్య, ఎం.శ్రావణ్ కుమార్, లతీఫ్, ఎల్ కె.కోటయ్య, ఎస్.కిషన్, కే.జంగయ్య, శశికళ, సీపీఐ(ఎం) నాయకులు ఎన్.శ్రీరాములు, ప్రభాకర్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.