Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారత దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 'సంకల్ప్ కిరణ్ పురస్కార్' అవార్డుకు నామినేట్ అయ్యారు. మానవతావా ది, దార్శనికుడు, లయన్ డాక్టర్ వై.కిరణ్ జన్మదినం సందర్భంగా 'సంకల్ప్ దివస్ 2022' (నవంబర్ 28) సందర్భంగా పీపుల్స్ ప్లాజా (నెక్లెస్ రోడ్డులో )లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సంకల్ప్ సంజీ వని పురస్కర్ (ఆరుగురు గ్రహీతలు), వికలాంగులైన పిల్లలు, వ్యక్తులకు గొప్ప సేవ చేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించడానికి సంకల్ప్ సిద్ధి పురస్కారాలు అందిస్తారు. రక్షణ మంత్రిత్వశాఖలో మాజీ డిప్యూటీ డైరెక్టర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, రెండుసార్లు సివిల్స్ ర్యాంకర్, సామాజిక కార్యకర్త, మోటివేటర్ అయిన బాలలతబీ రెండుసార్లు జాతీయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఎం.శ్రీనివాసు లు ఈ కార్యక్రమానికి సంకల్ప విశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. ఈ అవార్డుల గురించి సుచిర్ ఇండియా చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ డా. వై.కిరణ్ మాట్లాడుతూ '' ఈ సంకల్ప్ అవార్డులు వారి గొప్ప పనిని గుర్తించడానికి, వారిని మరింత చేయడానికి ప్రోత్సహించే ప్రయత్నం. ఈ ఏడాది కూడా మేం కొన్ని సామాజిక సంస్థలను, గొప్ప పని చేస్తున్న వ్యక్తులను ఎంచుకున్నాం'' అని తెలిపారు. పురస్కారం అందుకున్న మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ అరుణారాయ్ మాట్లాడుతూ ''తన పుట్టిన రోజును విభిన్నంగా చేసుకుం టున్న లయన్ డాక్టర్ వై.కిరణ్‌ను అభినందిస్తున్నాను. తన పుట్టినరోజు సమయాన్ని ప్రత్యేక అవసరాలున్న ప్రత్యేక పిల్లలతో గడపాలన్న ఆయన విధానం ఎంతో అభినంద నీయం. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి, ఇవ్వడాన్ని విశ్వసించే అలాంటి వ్యక్తులు భారతదేశానికి మరింత అవసరం. ఈ గౌరవాన్ని అందుకోవడానికి, ఈ సందర్భాన్ని అందరితో కలిసి చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరవుతాను'' అని తెలిపారు.
ఈ ఏడాది సంకల్ప్ సంజీవని పురస్కారాలు..
మద్రాస్ హైకోర్టులో అంధ న్యాయవాది కుమారి ఎం.కర్పగం, బధిరుడైన ట్రావెల్ ఫొటోగ్రాఫర్, బ్లాగర్ శ్రీవత్సన్, శారీరక వికలాంగుల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేష్, తెలుగు, హిందీ భాషల్లో వీల్ ఛైర్ లైవ్ సింగర్ ధనుంజరు, నోటితో పెయింటింగ్ వేసే కళాకారిణి కుమారి శ్రీలేఖ, ప్రత్యేక అవసరాలున్న నృత్యకారిణి తపస్‌కు పురస్కారాలు లభించాయి.