Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాబోయే రోజుల్లో అధికారంలోకి ఎలాగూ రాలేమని ప్రతిపక్షమైన దక్కించుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తాజ్ మహల్ హోటల్లో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్.గౌతమ్ రావు అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రతి బూత్ స్థాయిలో, ప్రతి కాలనీలో, ఇంటింటికి మోదీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా పదధికారులు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.