Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
భూ సమస్యపై కావాలని జటిలం చేస్తున్న కొందరు వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని జగదిరిగుట్ట గాజులరామానికి చెందిన వ్యాపారి డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డి. లక్ష్మీనారాయణ రెడ్డికి ఐదుగురు కొడుకులు. అందులో అందరికన్నా చిన్నవాడిని అయినా తనకు సర్వేనెంబర్ 295లో 10 ఎకరాలు వచ్చిందన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత శాలివాహన బిల్డర్లకు తన నలుగురు అన్నదమ్ములు 40 ఎకరాలను అమ్ముకున్నారని చెప్పారు. 'తన భూమికి రక్షణ కల్పించడానికి స్థానికంగా ఉన్న లక్ష్మారెడ్డి, అమర ఇంద్రసేన గుప్తా, నరేందర్‌లు సహకారం చేసి వారి కావాల్సిన వాటాను 700 గజాలు తీసుకొని దాన్ని అమ్మి వేశారు. కొన్నవారిలో రెవెన్యూ అధికారి, వీఆర్వో కూడా ఉన్నది. అయితే వారికి వచ్చిన 700, 300 గజాలు తీసుకున్న ఆమె పోలీసులు సహకారంతో భూమి ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ నుంచి పదేపదే ఫోన్లు చేయించి తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు' అని ఆరోపించారు. వీరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.