Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్ మీనా అన్నారు. ఈమేరకు మంగళవారం డెంటల్ హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంట్రాక్ట్ వర్కర్లందరికీ జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్‌లో జరుగుతున్న అవకతవకలను నివారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్, సీఐటీయూ జిల్లా సీనియర్ నాయకులు విఠల్, డెంటల్ కమిటీ సభ్యులు దర్శన్, సతీష్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.