Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాలు జరగకుండా చూడాలి
- అవసరమైన చర్యలు తీసుకోవాలి
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
- కలెక్టరేట్లో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు జిల్లాలోని ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడాలని అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో సంబంధిత శాఖల అధికా రులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతలపై రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్, జిల్లా రవాణాశాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ, పోలీసు, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖలతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవేతో పాటు రాజీవ్ రహదారి ఉన్నాయనీ, ఆయా ప్రాంతాల్లో ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. ప్రమాదాలు జరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే అసలు ప్రమాదాలే జరగకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో జాతీయ రహదారి, రాజీవ్ రహదారితో పాటు పలు రహదారులపై స్పీడ్ లిమిట్స్ బోర్డులను, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వాహనదారులు ఎక్కవ స్పీడ్తో వెళ్ళకుండా నిర్ణీత వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్ల, రహదారుల వద్ద మూలమలుపులు, పాఠశాలలు, కళాశాలల వద్ద సిగల్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాల్లో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళితే ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయా శాఖల అధికారులు అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని తీసుకోవాల్సిన చర్యల గురించి అవసరమైన సూచనలిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో గతంలో నిర్వహించిన సమావేశాలపై చేపట్టిన చర్యలు, తదితర విషయాలను అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సమావేశంలో సూచించిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసమూర్తి, ఆర్టీవో కిషన్ నాయక్, పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్, ఆర్టీసీ, డీఎం చంద్రకాంత్. పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ కమిషనర్లు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.