Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి మండల పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ అడ్డా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాల నీ, సంబంధిత కార్మిక శాఖ తగు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాయకులు, మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నివసిస్తూ డిసెంబర్ 2వ తేదీన దేశ వ్యాప్త నిరసన కార్యక్రమంను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కార్మిక శాఖ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయడంలో కాలయాపన చేస్తున్నారనీ, అడ్డాలపై సరైన మౌలిక సదుపాయాలైన టాయిలెట్స్ లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రోజువారి పని దొరక లేని పరిస్థితిలో కార్మికులు పస్తులు ఉంటున్నారన్నారు. కనీసం అడ్డాలపై రూ.5 భోజనమైనా ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన కార్మికులందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలనీ, 60 ఏండ్లు దాటిన ప్రతి కార్మికులకు పింఛన్ ఇవ్వాలనీ, సేజ్ పేరు మీద వసూలు చేసిన రూ.1000 కోట్లను అడ్డా కార్మికులకే ఖర్చు చేయాలనీ, కార్మికులకు కనీసం 150 రోజుల పని పథకాన్ని అమలు చేయాలనీ, కార్మిక శాఖలో ఉన్న అవినీతిని అరికట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అడ్డా కార్మికులందరినీ పెద్ద సంఖ్యలో సమీకరించి కార్మిక శాఖను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు కుర్ర యాదగిరి, భవన నిర్మాణ అడ్డా కార్మికులు కృష్ణ, మదిలేటి, నాగన్న, నరసిం హ, శ్రీను, నిరంజన్, సోమయ్య, రవి, లింగన్న, వెంకట య్య, రామాంజనేయులు, మంజులమ్మ, బంగారమ్మ, హంసమ్మ, సత్తమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.