Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాష్ట్రంలో అర్హత గల పేదలకు డబుల్ బెడ్ ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ప్రజా పోరాటాలను ఉధృతంగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.బాల మల్లేష్ పేర్కొన్నారు. ఈసీఐఎల్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో వీబీ బాలరాజు అధ్యక్షతన జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కౌన్సిల్ సమావేశంలో బాల మల్లేష్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే రోజు రాష్ట్రమంతటా సమగ్ర సర్వే జరిపి రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు దాదాపు 22 లక్షల పైగా ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్ప టికీ ఆచరణలో వారికి ఇండ్ల, డబుల్ బెడ్ రూమ్స్ ప్రభు త్వం ఇవ్వడంలో విఫలమైందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వేలాదిమంది ఇండ్లు లేని పేదలు ఉన్నారనీ, వారందరూ ఇండ్ల స్థలాల కోసం అప్లై చేసుకున్నప్పటికీ నేటికీ స్థలాలు ఇవ్వలేదన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూ ములు, భూదాన భూములు, దేవాదాయ భూములు అన్యా కాంతం అవుతున్నప్పటికీ వాటిని నిరోధించడంలో ప్రభు త్వం విఫలమైందన్నారు. రానున్న కాలంలో ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్స్ కోసం సాగే ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనం తరం వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం పూర్తి చేయా లనీ, అర్హులైన పేదలకు పెన్షన్లు ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వీబీ బాలరాజు, జిల్లా కార్యదర్శి తోటపల్లి శంకర్, బీకేఎంయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యాదమ్మ, మహాలక్ష్మి, జిల్లా నాయకులు జంగయ్య, మంగళంపల్లి తిరుపతి, ఐలయ్య, స్వరూప, రవి నాయక్, వై.వెంకటేష్, రాజమ్మ, అజీజ్, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.