Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి ఒక్కరికీ మధుమేహంపై అవగాహన కల్పించాలి అని వైద్య నిపుణులు అన్నారు. దేశంలో 18 ఏండ్లు పైబడిన 77 మిలియన్ల మందికి టైప్-2 మధు మేహం ఉన్నట్టు అంచనా అని తెలిపారు. 50శాతం కంటే ఎక్కువ మందికి వారి మధుమేహం స్థితి గురించి తెలి యదు. ఇది ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు. డయా బెటీస్ నిర్వహణ సమస్యలను పరిష్కరించడానికి, ఇటీవల ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా డయా బెటీస్ కార్యక్రమం నిర్వహించారు. మధుమేహం విస్త్రృ తంగా ప్రబలుతున్నప్పటికీ, అవగాహన లోపం ఉంది. మధుమేహం గురించి తెలుసుకోవడం, దాని నిర్వహణలో చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యం అని డయాబెటిస్ వైద్య నిపుణులు, డాక్టర్ కె.నీలవేణి ఎండోక్రినాలజిస్ట్, ఎండోక్రినాలజీ ప్రొఫెసర్బీ డాక్టర్ శ్రీదేవి పట్నాల, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ బీట్రైస్ అన్నే, అసోసి యేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రి నాలజీ, డాక్టర్ రామన్ బొద్దుల సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రినాలజీ తెలి పారు. హెల్త్‌కేర్ కమ్యూనిటీకి అత్యంత ముఖ్యమైన సమ స్యలపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాదీ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2022లో డబ్ల్యూడీడీ ప్రచారం నాణ్యమైన మధుమేహ విద్యకు మెరుగైన ప్రాప్యత ఆవశ్యకతపై దృష్టి సారిస్తుంది.