Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్‌లో జరుగుతు న్న అండర్ 16 విజరు మర్చంట్ ట్రోఫీలో పాల్గొనేందుకు హైదరాబాద్ క్రికెట్ జట్టు బోయినపల్లి పెన్షన్ లైన్‌కు చెందిన అబూబకర్ సిద్ధికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ మంగళవారం అబూబాకర్ సిద్దిని సన్మానించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాలని జంపన ఆకాంక్షించారు. క్రికెట్లో ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, షకీబ్, మౌల, ఆజాం, తదితరులు పాల్గొన్నారు.