Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయం, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ పదార్ధాల ఉపయోగం, సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మొదలైన అంశాలపై మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమిషనర్ పి.రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఐకేర్ ఎన్అర్సీఎం ''నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్'', ఎకో భారత్ - ఇన్నోవేషన్ హబ్ కంపెనీతో కలిసి నగర పరిధిలోని చికెన్, మటన్, బేకరీ, కూరగాయల విక్రయదారులు, హౌటల్స్, టిఫిన్ సెంటర్, ఫంక్షన్ హాల్స్, మాల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి ''స్వచ్చ పీర్జాదిగూడ'' నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నగర పరిధిలో ప్రజలకు అందుబాటులో సుమారు రూ.7.5 కోట్లతో సమీకృత శాఖహార, మాంసాహార మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు సోర్స్ సేగ్రీగ్రెషన్ ద్వారా తడి, పొడి, హానికారక చెత్తను వేరుచేసి స్వచ్చ కార్మికులకు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. చికెన్, మటన్, చేపలు, కూరగాయలు ఇతర విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతను పాటించి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు అందించాలన్నారు. అక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలను తరలిం చడానికి ప్రత్యేకంగా స్వచ్చ ఆటోలను ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నం దున ప్రజలకు ప్రత్యామ్నాయంగా జూట్ బాగ్స్, పేపర్ బాగ్స్ వాడటం అలాగే ఎకో భారత్ కే ఇన్నోవేషన్ హబ్ ప్రయివేటు లిమిటెడ్ వారు పర్యావరణానికి హాని చేయని ''బయో డిగ్రీడబుల్ బాగ్స్'' ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించాలని కోరారు. ఇందుకోసం ప్రతి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి షాప్ల యందు ''ప్లాస్టిక్ ఫ్రీ షాప్'' ప్లాస్టిక్ రహిత దుకా ణంగా బోర్డు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి అభినందన పత్రాలు అందజేస్తామని తెలిపారు. తద్వారా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ దేశానికే మార్గదర్శి కానుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పి.బస్వరాజ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మాట్లాడుతూ మాంసాహార విక్రయదారులు ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమై మాంసాన్ని విక్రయించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ప్రధానంగా గొర్రెలు, మేకలు, చికెన్ మొదలైన వాటి మాంసం శుభ్రపరచడం, కత్తులను తరచూ వేడి నీళ్లలో కడగటం, తలకు టోపీ, చేతికి గ్లౌసులు, ఆప్రాన్ ధరించాలని సూచించారు. మాంసాన్ని నేలపై కాకుండా ఎత్తులో వేలాదీయడం వాటిపై దుమ్ము,దూళి చేరకుండా బట్ట లేదా కవర్ కప్పడం లేదా ఫ్రీజర్లో భద్రపరచడం ద్వారా మాంసం చెడిపోకుండా ఉంటుందని పేర్కొన్నారు. మాంసం విక్రయించే పరిసర ప్రాంతంతో పాటు సరఫరా చేసే వాహనాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. వినియోగదారులు తప్పకుండా మాంసాన్ని మంచి ఉష్ణోగ్రత మధ్య వేడిచేసి తీసుకోవాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. మటన్, చికెన్ విక్రయదారులు ఏవైనా వ్యాధి లక్షణాలు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యు లు, సైంటిస్ట్ బస్వారెడ్డి, డాక్టర్ బార్బుదే, డైరెక్టర్, ఐకార్ - జాతీయ మాంస పరిశోధన కేంద్రం, సీనియర్ ఎన్విరా ంన్మెంటల్ ఇంజినీర్ ఉదరు సింగ్, ఎకో భారత్ చీఫ్ అడ్వైసర్ వెంకటేశ్వర్ రెడ్డి, సీఈవో ప్రసన్న లక్ష్మి, శానిటేషన్ ఎస్ఐ జానకి, వార్డ్ ఆఫీసర్లు, మటన్, చికెన్ విక్రయ దారులు, తదితరులు పాల్గొన్నారు.