Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట రియల్టర్ల ధర్నా
నవతెలంగాణ-ఘట్కేసర్
గ్రామపంచాయతీ లేఔట్లలో నిలిపివేసిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ మండల సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వ హించారు. అసోసియేషన్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నరసయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2020లో నిలిపివేసిన గ్రామపంచాయతీ లేఔట్లలో ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం రియల్టర్లతో పాటు ఆ వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాటు యజమానులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ కొత్త పద్ధతి వద్దు పాత పద్ధతి ముద్ద అన్నారు. ఎల్ఆర్ఎస్ లేకుండా గ్రామపంచాయతీ లేఔటల్లో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహేష్, ఘట్కేసర్ మండల జనరల్ సెక్రటరీ వై.మధు కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నందు, ఉపాధ్యక్షులు కె. రాజశేఖర్, కె.బుచ్చిరెడ్డి, చింతల భాస్కర్ రెడ్డి, వి.రఘు, కె.సుధాకర్, బాలరాజ్, ఏ.శ్రీకాంత్, ఎన్.శ్రీశైలం, యజ్ఞ దత్తు, రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.