Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
కార్పొరేషన్ పరిధిలోని ముస్లిం శ్మశాన వాటికపై కొంత మంది కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనీ, ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలనీ, లేనిపక్షంలో తగిన విధంగా బుద్ధి చెప్తామని మైనారిటీ నేతలు హెచ్చరించారు. మంగ ళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక వద్ద ముస్లిం మైనారిటీ నాయకులు విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయించార ని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా గతంలో ప్రహరీ నిర్మించారన్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మిగిలిన స్థలానికి ఎన్నోసార్లు వినతిపత్రం అందజేశామనీ, స్పందించిన కార్పొరేటర్లు బొమ్మక్ కల్యాణ్ కుమార్, దానగళ్ళ అనిత కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి నిధుల నుంచి రూ.9లక్షలను ప్రహరీ గోడ నిర్మించడానికి కేటాయించినట్టు తెలిపారు. 2021లోనే శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఓ దిన పత్రి కలో ''వెయ్యి గజాల కబ్జాకు కార్పొరేటర్ భర్త ఉరుకులు పరుగులు'' అనే కథనానికి స్పందించిన ముస్లింలు పెద్ద ఎత్తున శ్మశాన వాటికకు చేరుకుని మాట్లాడుతూ మాకు ఎవరి నుంచి స్వచ్ఛందంగా నిధులు రాలేదనీ, మున్సిపల్ నిధులతోనే నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. దీనికి కార్పొరేటర్ భర్త కబ్జా చేస్తూ విరాళాలు ఇచ్చారన్న వార్త అసత్యమనీ, వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ నిర్మాణం అపేలా చూస్తున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదన్నారు. ఈ వ్యవహరంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం తగదని హెచ్చరించారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు. కావాలని కొందరు వ్యక్తులు ఇలాంటి దుష్పాచారానికి ఒడి గడుతూ తనకు నచ్చిన విధంగా వార్తలు రాయడం పద్ధతి కాదనీ, పూర్తిగా అందరి వివరణ తీసుకున్న తర్వాతనే ఇలాంటి వార్తలు రాయాలని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిదనీ, లేదంటే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుం దని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండీ.ఆఫ్జల్ ,అలీమ్, హైమద్, నజీర్,గులాం, సలీం, అక్బర్, గౌస్, షారుక్, కాజా, తదితరులు పాల్గొన్నారు.