Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు
నవతెలంగాణ-అంబర్‌పేట
స్వార్థ రాజకీయాల ప్రయోజన కోసం మహిళను కులం పేరుతో దూషిస్తూ, యాదవ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి వెంటనే క్షమాణలు చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అంబర్‌పేట డివిజన్ న్యూపటేల్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు జి.మల్లేష్‌యాదవ్, డి.దయాకర్యాదవ్, ఎం.మల్లికార్జున్‌యాదవ్, సాయిలుయాదవ్, కిరణ్‌యాదవ్, మణిదీప్యాదవ్, లడ్డూయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, మహేష్‌యాదవ్, మనిష్యాదవ్ మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్పై అనుచిత వాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఘటనకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే బేతి సుభాస్‌రెడ్డి యాదవ సమాజానికి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.