Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డివిజన్ పరిధిలోని పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం రహత్ నగర్ పిపి బ్రదర్స్ గల్లీలో పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా అనేక ఇబ్బందుల మధ్య సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారని ప్రతి రోజూ వాటర్ క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. డివిజన్లో అనేక ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని అన్ని శాఖల అధికారులు సన్వయంతో పని చేస్తూ వాటిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి, నాయకులు కృష్ణగౌడ్, చుక్కా జగన్, మిర్యాల శ్రీనివాస్, గోవింద్ అర్జున్, సునంద, బాలకృష్ణగౌడ్, మణిచంద్గౌడ్, యోగేష్గౌడ్, వరలక్ష్మి, మహేశ్వరి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.