Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్ గ్రీనా ల్యాండ్ హౌటల్ నుండి పటేల్‌నగర్ వరకు నిర్మిస్తున్న నాలా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అధికారులకు సూచించారు. బుధవారం నాలా నిర్మాణ పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సన్వయంతో పని చేస్తూ నాలా నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, సువర్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కెఎల్ఆర్, మహేష్ ముదిరాజ్, షానూర్, ఆదిల్, మోహన్, లవంగు నాగరాజు, వేణు, ప్రవీణ్, సంతోష్‌చారి పాల్గొన్నారు.