Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇండియన్ టైల్స్టోన్ ఇన్స్టాలేషన్ ప్రొడక్ట్ విభాగంలో అగ్రగామి గొప్ప ప్రీమియం బ్రాండ్ అయిన మైక్ లాటిక్రెట్ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. వినూత్నమైన టైల్ స్టోన్ ఇన్స్టాలేషన్ సొల్యూషన్ల వైపు తమ డీలర్లకు కొనుగోలుదారులకు చక్కని అవకాశం ఈ సందర్భంగా సంస్థ ఎండీ మురళి యాదమ్మ, అమర్ బీర్ పాట్ల అధ్యక్షులు సేల్స్ మార్కెటింగ్ తెలిపారు. భారతదేశం అంతటా 5 తయారీ కర్మాగారాలు, 28 ప్రాంతీయ కార్యాలయాలు, అత్యాధునిక ఆర్ అండ్ డీ శిక్షణ కేంద్రం, భారతదేశం అంతటా ఖాతాదారుల అవసరాలకు సేవలందిస్తున్న వేయి మంది ఉద్యోగులతో దాని కార్యకలాపాలను కొనసాగిస్తుందని అన్నారు. వాటర్ ప్రూఫ్ కలిగి అత్యంత నాణ్యమైన ప్రొడక్ట్‌ను ప్రజలకు అందజేయడమే తమ లక్ష్యమని వివరించారు.