Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జనవరి 18వ తేదీ నుంచి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం అమలు అవుతుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్లో వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తునందు న ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్న కంటి వెలుగు -2 కార్యక్ర మంపై ప్రోగ్రాం అధికారులు, వైద్య అధికారులకు, రిపోర్టింగ్ సూపర్వైజర్లకు అవగాహనా సదస్సును నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహి స్తుందన్నారు. వరల్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాంగా ఇది నిలవాలన్నారు. ప్రజల కంటి సమస్యలు తొలగించేలా ఇప్పుడు మరో మారు కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారన్నా రు. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా రీడింగ్ గ్లాసెస్, ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఇస్తారని తెలిపారు. పూర్తి బాధ్యతతో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతంగా పని చేయాలి అధికారులకు సూచించారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ జిల్లాలో బాధపడకూడదనే లక్ష్యంతో అందరం కృషి చేద్దాం అన్నారు.