Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత జాతీయ మహాసభలను జయప్రదం చేయా లని ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బ్యాగారి వెంకటేష్ కోరారు. మహాసభల పోస్టర్‌ను ఈసీఐఎల్‌లోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆవిష్క రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నాలుగు రోజులపాటు జరిగే మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తు న్న విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం బలమైన తీర్మానాలు చేయబోతున్నామన్నా రు. అనంతరం భవిష్యత్తు కర్తవ్యాలతో దేశంలో ఒక బలమైన కార్యాచరణ ను రూపొందించి ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నిర్వహించే పోరాటాలు, మహాసభల విజయ వంతానికి విద్యార్థులు, మేధావులు వివిధ వర్గాల ప్రజలం దరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మతోన్మాదంను తీసుకొచ్చి విద్యార్థుల మధ్య చిచ్చులు పెడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులందరూ ఐక్యమై విద్యారంగ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సుమంత్, జిల్లా నాయకులు వంశీ, మనోజ్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.