Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
చిదానందం కాలనీలోని పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ నిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మా రావునగర్‌లో గల చిదానందం కాలనీ పార్క్ స్థలం కొద్ది కాలంగా కోర్టు వివాదాలలో ఉండగా, ఇటీవల కాలనీ వాసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో బుధవారం చిదానందం కాలనీ వాసులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పార్కులను ఎంతో అభివృద్ధి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొ స్తామని చెప్పారు. పార్కులో వాకింగ్ ట్రాక్, కూర్చునేందు కు అనువుగా గాజోబా నిర్మాణం, ఓపెన్ జిమ్, పచ్చదనం పెంపొందించే విధంగా మొక్కల పెంపకం చేపడతామని చెప్పారు. వెంటనే హార్టికల్చర్, జీహెచ్ఎంసీ అధికారుల ను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫోన్లో ఆదేశిం చారు. మంత్రి ఆదేశాల మేరకు బన్సీలాల్ పేట కార్పొరేట ర్ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్, డీఈ ఆంజనేయులు, చిదానందం కాలనీకి వెళ్ళి అభివృద్ధి పనులను చేపట్టడానికి పార్కు స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట చిదానందం కాలనీ అధ్యక్షులు సత్యనారా యణ, అమర్నాద్, నాయకులు రాజు, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, తదితరులు ఉన్నారు.