Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు నమోదుపై వివిధ కళాశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాలు ఆకట్టుకుంటు న్నాయి. స్ట్రీట్ ప్లే నేపథ్యంలో బుధవారం నిజాం కళాశాల, ఏఎంఎస్ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన స్ట్రీట్ ప్లే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఏఎంఎస్ కళాశాల విద్యార్థులతో ఐమాక్స్ థియేటర్ వద్ద మధ్యాహ్నం, నిజాం కళాశాల విద్యార్థులతో ఎర్రమంజిల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. నమోదు, ఆధార్ లింకేజీ, జాబితాలో తప్పుల సవరణ తొలగింపు, గుర్తింపు కార్డులో మార్పులు, వికలాంగుల గుర్తింపు కోసం ఎవరిని సంప్రదించాలో వివరిస్తూ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023 జనవరి 1, నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదయ్యేందుకు ఫారం-6ను, ఓటర్ గుర్తింపు కార్డుకు ఫారం-6బి ద్వారా నమోదు చేసుకోవాలని స్ట్రీట్ ప్లే ద్వారా వివరించారు. పూర్తి వివరాలకు సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలనీ, తమ ప్రదర్శన ద్వారా చక్కగా వివరించారు. షషష.అఙరజూ.ఱఅ ద్వారాగాని, ఓటర్ హెల్ప్లైన్యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవాలనీ, ఓటరు జాబితాలో పేరు పరిశీలన వెబ్సైట్లో సరి చూసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి, నిజాం కాలేజీ కల్చరల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ మాధవి, ఖైరతాబాద్ ఏఎంహెచ్ఓ భార్గవ్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.