Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపల్ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించా రు. సమావేశంలో పట్టణంలోని వివిధ వార్డుల్లో సుమారు రూ.90 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు తీర్మానించి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నాగారం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాననీ, కౌన్సిలర్లు అందరూ సహకరించాలని కోరారు. మంచి నీటి సమస్యను తీర్చడానికి ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని హెచ్ఎండ బ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ వాణి రెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, డీఈఈ రఘు, మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.