Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్‌నగర్ మేయర్, డిప్యూటీ మేయర్
నవతెలంగాణ-జవహర్ నగర్
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్లో అభి వృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయనీ, గుంతల రోడ్లు కనిపించవని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కార్పొరేష న్లోని డివిజన్లలో గుంతల రోడ్లలో మట్టి పోస్తు సుంద రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ప్రగతి పనులు పూర్తి కావొచ్చాయన్నారు. జవహర్‌నగర్ గతంలో అభివృద్ధికి దూరంగా ఉందనీ, మంత్రి మల్లారెడ్డి సహకారంతో వందల కోట్లు వెచ్చించి ప్రగతి పనులతో నూతన ఒరవడి సృష్టించామన్నారు. జవహర్ నగర్‌ను మోడల్ కార్పొరేషన్ గా మార్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ 17వ డివిజన్ నాయకులు సుబ్రమణ్యం, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.