Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 315లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కీసర రైతులు వేడుకున్నారు. బుధవారం కీసరలో రైతులు విలేకరులతో మాట్లాడుతూ కీసరలోని సర్వే నంబర్ 312 లో రామిడి భూపాల్ రెడ్డి, రామిడి రాంరెడ్డి, రామిడి నవీన్ కుమార్ రెడ్డి, జలాల్పురం సత్తిరెడ్డిలకు ఎకరా 15 గుంటల చొప్పు న నలుగురికి మొత్తం ఐదెకరాల 21 గుంట స్థలం ఉంద న్నారు. 312 సర్వే నెంబర్‌కు ఆనుకుని 315 సర్వే నెంబ ర్లో ప్రభుత్వ స్థలం నాలుగెకరాల 11 గుంటల స్థలం ఉందన్నారు. ఈ సర్వే నంబర్లో గతంలో కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో పేదలకు 60 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ స్థలం ఖాళీగా ఉండటంతో కీసర వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి దర్జాగా కబ్జా చేసి కాంపౌండ్ వాల్‌ను నిర్మించడాని తెలిపారు. రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే నెంబర్ 315లోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరుతూ కీసర ఉప తహశీల్దార్ రెహమాన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.