Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట బతుకమ్మ కుంట బస్తీలో దివ్య దిశ సంస్థ, పాల్ అమ్లేన్ సంస్థ భాగస్వామ్యంతో బాలల హక్కుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలలో పిల్లలకు లెమన్ స్పూన్, తాడు ఆట, డ్రాయింగ్ ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర నాయకులు మహేందర్ పాల్గొని పిల్లలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దివ్య దిశ సంస్థ సిబ్బంది, ప్రాజెక్టు మేనేజర్ దీపక్, ప్రియాంక, పిల్లల తల్లిదండ్రులు, బస్తీ వాసులు నాగమ్మ, వెంకటయ్య, మహేష్ శేఖర్ పాల్గొన్నారు.