Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మెన్ ప్రవీణ్
నవతెలంగాణ-ధూల్‌పేట్
పేదలకు వెయ్యిలో ఒక్కరికైనా చేయూత నందించాలనే దృక్పథం కలిగి ఉండాలని లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మెన్ ప్రవీణ్ అన్నారు. నందమూరి హరికృష్ణ మిత్రుడు సంస్థ ప్రతినిధి శనక్కాయల కృష్ణారావు ఆధ్వర్యంలో రాజారెడ్డి, సత్య సంగీత ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ ఓంకార్ రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 100 మంది పేదలకు రేషన్ కిడ్స్, 100 మంది పేదలకు దుప్పట్లు, వంద మంది పేదలకు ఫుడ్ ప్యాకెట్స్, 60 మంది చిన్నారులకు స్కూల్ బ్యాగ్ కిడ్స్ పలువురు సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో 2020లో స్థాపించబడిన సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో చేస్తుందన్నారు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఈ సంస్థ ద్వారా నిరుపేదలైన కుటుంబాలకు, నిరుపేదలైన విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులకు తనకు తోచినంత సహాయం చేస్తున్నామన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేయూతనందించారు అన్నారు. ఉమెన్ రైట్స్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ పులుసు పద్మావతి, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు పద్మజాదేవి రేషన్ కిడ్స్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారన్నారు. సహాయం అందించిన పలువురి దాతలకు సంస్థ ప్రతినిధి కృష్ణారావు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్స్, వాలంటీర్స్ ప్రభాకర్, రమేష్, అభిషేక్, ఉదరు, ఆర్ కుమార్, విజరు కుమార్, ప్రవీణ్ కుమార్, కృపావరం, ప్రసాద్, జస్వంత్, ప్రవీణ్, ఎస్పీ కుమార్, ఈదన్న, జ్యోతి, ఝాన్సీ, సింధు, రుతు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.