Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. కొన్ని రోజులుగా డిడి కాలనీలో డ్రయినేజీ పొంగిపొర్లుతుండటంతో స్థానికుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం పర్యటించి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు నూతన పైపులైన్ నిర్మాణం చేపడతామని అన్నారు. రోడ్డు వాలుగా ఉండటంతో వర్షం వచ్చినపుడు ఎగువనుంచి వరద ఉధృతికి డ్రయినేజీ పొంగిపొర్లుతుందని అన్నారు. సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిడి కాలనీలో ఏపుగా పెరిగి విద్యుత్ వైర్లకు అడ్డుగా చెట్ల కొమ్మలను తొలగించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జలమండలి జీఎం శ్రీధర్ రెడ్డి, డీజీఎం విష్ణువర్ధన్రావు, ఏఈ మాజీద్, వర్క్ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, బాగ్ అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రమోహన్, స్థానికులు డాక్టర్ రవింద్రనాథ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.