Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి ఓ ఆండ్ ఎం, రెవెన్యూ, ఎంసీసీ, ఏఎంఎస్, తదితర అంశాలపైన ఎండీ దాన కిశోర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను వీలైనంత వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా కలుషితనీరు, సీవరేజీ, ఓవర్ఫ్లో, మిస్సింగ్ మ్యాన్హోళ్లపైన వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కలుషితనీరుపై తరుచూ, పలుసార్లు వచ్చే ఫిర్యాదులను గుర్తించి, అధ్యయనం చేసి ఆ సమస్య పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే బకాయిల వసూలుపైనా అధికారులు దృష్టి సారించాలని ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. కమర్షియల్, నాన్ ఫ్రీ వాటర్ స్కీమ్ కనెక్షన్ల నుంచి బకాయిలు వసూలు చేయాలని ఆయన సూచించారు. సీవరేజీ కనెక్షన్ల బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుదీర్ఘకాలంగా బకాయిలు చెల్లించడంలో మొండికేస్తున్న వారి నుంచి బాకాయిలు కచ్చితంగా వసూలు చేయాలని, లేదంటే నోటీసులు ఇచ్చి కనెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే 20 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజు కనెక్షన్ వినియోగదారుల నుంచి బకాయిలపై ఫోకస్ చేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఓ ఆండ్ ఎం డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.