Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వికలాంగులకు ఉత్తమ సేవలందించేందుకు కృషిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి అన్నారు. తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ 'డెసినేషన్ ఎడ్యుటెక్ ప్రయివేట్ లిమిటెడ్' వారి సహకారంతో ఇ-లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా వికలాంగుల విషయాలపై 150 నిమిషాల నిడివి గల 32 వీడియోలను అభివృద్ధి చేసి శాఖలోని ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దివ్య, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ లతో కలిసి ఈ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. అనంతరం వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కొత్త ఆవిష్కరణలు భారతదేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో మొదలవడం హర్షనీయమన్నారు. తెలంగాణ వికలాంగుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైకల్యం అనే అంశంపై క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా అందించి వారి సంక్షేమం కోసం కృషి చేయడమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం అని వివరించారు. కార్యక్రమంలో డెసినేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈఓ ఎస్వీ కృష్ణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.