Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మెన్ శివరాత్రి ఐలీమల్లు
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణలోని వడ్డెర సామాజిక వర్గాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి, ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మెన్ శివరాత్రి ఐలీమల్లు నేతృత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏండ్లుగా తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు దక్కక వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని చైర్మెన్‌గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్నారు. వడ్డెర కాంట్రాక్టులకు ప్రభుత్వ పనుల్లో 20 శాతం ఈఎండీ లేకుండా కేటాయించాలని కోరారు. వడ్డెర సామాజిక వర్గానికి క్వారీల్లో 20 శాతానికి పైగా హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జనాభా దామాషా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఉప్పల్‌లో ప్రభుత్వం నిర్మించబోతున్న వడ్డెర ఆత్మగౌరవ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు వడ్డెర్ల వెనుకబాటుపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు.