Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నేషనల్ అడ్వెంచర్ ట్రైనింగ్ క్యాంపుల్లో ఓయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రాణించారని వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఈసందర్భంగా ఓయూ పరిపాలన భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారిని ప్రత్యేకంగా అభినందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలియడ్ స్పోర్ట్స్ నిర్వహించిన రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్ ట్రెక్కింగ్‌లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి సముద్రమట్టం నుంచి 10,500 అడుగుల ఎత్తుకు చేరుకొని జాతీయ పతాకాన్ని ప్రదర్శించారని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సవీన్ సౌదా, ప్రోగ్రాం ఆఫీసర్ స్వాతి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.