Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సాకెట్ కాలనీలో అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రయినేజీ పనులను చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సాకేత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శరత్ రెడ్డి, సహాయ కార్యదర్శి రవీందర్రావు, కోశాధికారి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సాకేత్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సాకేత్ కాలనీలో కొంతకాలంగా నీటి సరఫరా, మురుగునీరు పారుదల, పార్కుల నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు. ఈ మధ్యకాలంలో కాలనీవా సుల ఫిర్యాదు మేరకు నూతన పైప్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్కుల నిర్వహణ కొంత మాత్రమే జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహిస్తున్నా రనీ, మిగతా పార్కులను కూడా నిర్వహణ చేపట్టాలని కోరారు. సాకేత్ కాలనీలో నిర్మించిన కమిటీ హాల్లో లైట్లు లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారిందనీ, జీహెచ్ ఎంసీ అధికారులు స్పందించి కమ్యూనిటీలో కావాల్సిన సదుపాయాలను కల్పించాలని కోరారు. కాలనీలోనే మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనీ, వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు కోర్టు కేసును పరిష్కరించి బయోడైవర్సి పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, జీహెచ్ ఎంసీ కమిషనర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.సమీపంలోనే కాలనీలా డ్రయినేజీ వరద కాలువలుగా తమ కాలనీలోకి వస్తున్నాయనీ, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్, రవి ప్రసాద్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
సాకేత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్య వర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీని వాసరావు, ఉపాధ్యక్షులుగా శరత్ రెడ్డి, కార్యదర్శిగా సురేష్ చందర్ నటరాజన్, సహాయ కార్యదర్శిగా రవీం దర్రావు, కోశాధికారిగా చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు గా రవిప్రసాద్, చంద్రమోహన్, లక్ష్మీ చౌదరి, పాండయ్య, రాజీవ్ మీనన్, మదుల శర్మ, రోశయ్య కమిటీని ఎన్ను కున్నట్టు అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.