Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్లో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం డివిజన్ కార్యాలయంలో డివిజన్‌కు సంబంధించి వివిధ ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీషా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమస్యను తెలియజేస్తే తక్షణమే పరిష్క రించాలని సూచించారు. సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనేక కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే వేయాలని సూచించారు. డివిజన్‌కు సంబంధించిన ఎస్ఎఫ్ఎలు, జవాన్లు పరిసరాల పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. ప్యాగిం గ్ వివరాలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాలని సూచిం చారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆయా కాలనీల్లో తక్షణమే ప్యాగింగ్ చేయాలని సూచించారు. జలమండలి అధికారులు కాలనీలలో ప్రెజర్ సమస్యలను పరిష్కరించా లని కోరారు. డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమ స్యలపై సమావేశంలో విస్తతంగా చర్చించారు. కార్యక్ర మంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎంటమాలజీ ఏఈ రమేష్, విద్యుత్ ఏఈ అర్చన, జీహెచ్ఎంసీ విద్యుత్ ఏఈ ప్రత్యూష, ఉద్యానవన శాఖ అధికారి నరోత్తం రెడ్డి, రాంకీ సర్కిల్ ఇన్చార్జి ఖాన్, ఎస్ఎఫ్ఏలు, జవాన్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.