Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే సాయన్న లబ్దిదారులకు రూ.25 లక్షలా 25 వేల కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మడ్ పోర్టు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ముందుగా ఇచ్చారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయం దగ్గర పరిసర ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు కూడా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మహిళా నాయకురాలు నివేదిత, సరిత, మాజీ సభ్యులు, సభ్యురాలు నలిని వెంకట్రావు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.