Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
జనాభా ధామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 52 శాతం రిజర్వేషన్లు పెంచాలని బహుజన విద్యార్థి సంఘాలు, బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఓయు ఆర్ట్స్ కళాశాల ఎదుట కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.చింతా గణేష్, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.వీరయ్య, ఓయూ బీసీ సెల్ డైరెక్టర్ డా.చలమల్ల వెంకటేశ్వర్లు, డా. కొర్రెముల శ్రీనివాస్ ప్రొ.ఇందిరా, ప్రొ. నమ్రత దొబోల్కర్, ప్రొ.లావణ్య, ప్రొ.సూర్య ధనుంజరు, ప్రొ.నతానియల్, ప్రొ.భారతి హాజరై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రొ.చింతా గణేష్ మాటాడుతూ డా.బీఆర్ అంబేద్కర్ దూరదృష్టి, దార్శనికతకు నిదర్శనం భారత రాజ్యాంగంలో కనబడుతుందన్నారు. విద్యార్థులు, పరిశోధకులు అంబేద్కర్‌లా మేధావులుగా తయారు కావాలన్నారు. ఓయూ బీసీ సెల్ డైరెక్టర్ డా.చలమల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని, కానీ వారికి రిజర్వేషన్లు 27 శాతమే అమలవుతున్నాయని ఇది బాధాకరం అన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీసీ జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు అప్పుడే బీసీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. కార్యక్రమంలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన జాక్ చైర్మెన్ వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, పోమాల అంబేద్కర్, రాజ్‌కుమార్, భాస్కర్, ప్రవీణ్, జీవన్, వెంకటేష్, ఆనంద్, శివ పాల్గొన్నారు.