Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఉద్యోగుల సంఘం
నవతెలంగాణ-బంజారాహిల్స్
అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ ఉద్దేశపూర్వకంగా వేధింపుల గురి చేయడం సరికాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులపై ఏసీబీ అధికారులు తీరు అమానుషమని అన్నారు. విచారణ పేరిట ఇలాంటి వేధింపులకు పాల్పడడం విచారకరమన్నారు. చట్టం పరిధిలో చర్యలు తీసుకోవాలని వ్యక్తిగత కక్షలతో పాల్పడితే ప్రభుత్వానికి ఉద్యోగ లోకానికి చెడ్డపేరు వస్తుందన్నారు. తనిఖీలు చేపట్టిన క్రమంలో ఇంట్లో పెద్ద ఎత్తున ఇలాంటి డబ్బులు అవి చేయలేదని, కానీ మీడియాకు మాత్రం ఐదు కోట్లు దొరికాయంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్‌పై చేసిన ఆరోపణలు ఇప్పటివరకు నిరూపించలేదని, నేటికీ ఆ కేసు తేలకపోవడంతో ఆయన వేతనాలు లేక వారి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తే కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విదిలేని పరిస్థితుల్లో న్యాయస్థానని ఆశ్రయించారన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు రవీంద్ర కుమార్, గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, ఉపాధ్యక్షులు జాకబ్, పవన్ కుమార్ తదితులు పాల్గొన్నారు.