Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఎర్రగుంట హిందూ శ్మశాన వాటికను స్థానిక నాయకులతో కలిసి నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితం శ్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలు, కొన్ని పిచ్చి చెట్లను తొలగించారు. శ్మశాన వాటికలో ఉన్న స్నానాల గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో తక్షణమే కొత్త గదులను నిర్మించాలని అసిస్టెంట్ ఇంజినీర్ లింగారావుకు కార్పొరేటర్ సూచించారు. ఇప్పటికే శ్మశాన వాటిక లోపల ఉన్న అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చినట్టు తెలిపారు. చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించినట్టు తెలిపారు. కొద్ది రోజుల్లో ప్రహరీ గోడపైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, శ్రీరామ్, సత్యనారాయణ, దాసరి కర్ణ, మంగోల్ శివకుమార్, రామచందర్, అశోక్, విజరు, శివ, దత్తు, కట్ట బుచ్చన్న గౌడ్, సువర్ణ, సుగుణాకర్ రావు, చంద్రశేఖర్, నవీన్, గోపి, లడ్డు, శివ, బాలరాజ్, వాసు, తిరుమల్, ఇన్స్పెక్టర్్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.