Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వల్లాల రవి యాదవ్ నియామకమయ్యారు. సీఆర్వో నేషనల్ ప్రెసిడెంట్ నవీన్‌శర్మ, స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ అగర్వాల్ ఆదేశాల మేరకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు రవికి గురువారం బాలానగర్‌లోని సీఆర్వో స్టేట్ ఆఫీసులో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తాను 2014 నుంచి సీఆర్వోలో పని చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ స్థాయి నుంచి స్టేట్ వరకు ఎదిగినట్టు గుర్తు చేశారు. పని చేసే వారికి పదవులు వస్తాయి అనడానికి తానే నిదర్శనం అన్నారు. సీఆర్వో అభివృద్ధిని తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నిజాయితీగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతానని పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను ఎప్పటికప్పుడు కమిటీ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని తెలిపారు. వినియోగదారులు మోసపోయినట్టుగా గ్రహిస్తే వెంటనే సీఆర్వోను సంప్రదిస్తే న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. సీఆర్వోను మరింత విస్తరించేందుకు తవ వంతుగా సహాయ నహకారాలు అందిస్తానని చెప్పారు. వినియోగదారుల పక్షాన ఉంటూ మోసం చేసే వ్యాపారుల ఆటలు సాగనివ్వకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్వో రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.